కరోనాతో సెలవులు ప్రకటించడం వల్ల పిల్లలు ఇళ్లల్లో భద్రంగా ఉన్నారు. ఇక స్కూలు మొదలవుతాయి. పిల్లలు విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి ఐదేళ్ల పిల్లలకు మాస్క్ తీయకుండా ఉంచుకునే అవగాహన ఉండదు కనుక వాళ్లకు మాస్కులు ఇచ్చిన పెద్ద ఉపయోగం ఉండనట్లే శానిటైజర్ వాడకం దూరం పాటించడం వంటివి స్కూల్లో తప్పనిసరి పాటించేలా ఉంటేనే పిల్లలను బయటకు పంపాలి. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి సామర్థ్యం ఎక్కువ కనుక వైరస్ సోకిన ప్రభావం తక్కువే అంటారు డాక్టర్లు. పిల్లల శ్వాసకోశ నాళాలు ఈ పెద్ద వాళ్లతో పోలిస్తే రెట్టింపు ఆరోగ్యంగా ఉంటాయి ప్రమాదం లేదు పిల్లలకు మంచి పోషకాహారం అందించాలి భోజనంలో 60, 70 శాతం తృణధాన్యాలు మిగతా పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలి.

Leave a comment