దీపావళి మరునాడు గోవర్ధన పూజలు చేసుకుంటాం.ఆ తర్వాత రోజే సోదర-సోదరీమణుల పండుగగా ఈ రోజు భగిని హస్త భోజనం అనీ భాయ్ దూజ్ అని వేడుక చేసుకుంటారు.

సోదర-సోదరీమణుల పండుగగా రక్షా బంధనంతో పాటు భగినీ హస్త భోజనం కూడా పురాణాల నుండి ఆచరిస్తున్నారు.సూర్య భగవానుడి పుత్రుడు యముడు,సోదరి యమున.తన నివాసానికి వచ్చిన సోదరునికీ తిలకం దిద్ది, హారతి ఇచ్చి,భోజనం పెట్టింది.యముడు మర్యాదకి సంతోషించి దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వాదిస్తాడు.
మరి సోదరీమణులు!! మరి మనం కూడా ఈ ఆచారం  అంతరించపోకుండా కాపాడుకుందామా!!

నిత్య ప్రసాదం: పాయసం,గారెలు,బేసన్ లడ్డూ.

-తోలేటి వెంకట శిరీష  

Leave a comment