బిర్యాని ఆకును చాల విరివిగా,సూప్స్,మాంసం,సీ ఫుడ్స్ ఇంకా శాఖాహార భోజనం తయారీలో ఉపయోగిస్తారు . బిర్యాని ఆకు ఉపయోగించి వండిన ఆహారాన్ని సర్వ్ చేసే ముందర ఈ ఆకు ని తీసివేస్తారు . ఆహారంలోనే కాదు పరిమళ ద్రవ్యాల తయారీలోను వినియోగిస్తారు . బిర్యాని ఆకును ఉడికించి నీటిని తలకు పట్టిస్తే చుండ్రు తగ్గిపోతుంది . ఈ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి ,రోగనిరోధక వ్యవస్థ ఇన్ ప్లమేషన్ కు కారణం అయ్యే ఇంటర్ ల్యూకిన్ అనే ప్రోటీన్లను చాలా తక్కువ పరిమాణంలో విడుదల చేస్తుంది. బిర్యాని ఆకును ఎక్కువ వాడితే ఈ ప్రోటీన్ మరింత తక్కువై పోతుంది కనుక దాన్ని పరిమితమైన మోతాదులో వాడాలి . చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ కు ఈ ఆకు దోహదం చేస్తుంది . క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గిపోతుంది .

Leave a comment