సంసారంలో చిన్ని చిన్న కలహాలు సాధారణమే అయ్యినప్పటికీ అవి పురుషుల ఆరోగ్యం పైన ప్రభావం చూపెడతాయని ఒక రిపోర్టు. తరచూ గొడవపడే భార్యా భర్తలలో భర్త కి డైయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందిట. భార్యలకు ఎక్కువగా ఈ లక్షణం కనబడలేదట. గొడవల వల్ల ఆందోళన వత్తిడి పెరిగి అది వారి మెదడు ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుందని రిపోర్ట్ చెప్పుతుంది. 50 ఏళ్ళు దాటిన 1300 మంది జంటల పైన 5 సంవత్సరాల పాటు పరిశోధన నిర్వహించి వెలువడిన రిపోర్టు ఇది. ఐదేళ్ళలో 1300 మంది జంటలో 389 మంది పురుషులకు చక్కెర వ్యాధి వచ్చినట్లు అధ్యయనం లో తేలింది. మిగితా వారి లో గుండె సంబంధిత సమస్యలు బి పి వంటి అనారోగ్య లక్షణాలు కనిపించాయిట.

Leave a comment