అటు వీరనారీ, ఇటు సౌందర్య రాశిగా ఒక క్రెడిట్ పోగుచేసుకుంది తమన్నా. బాహుబలి సినిమా విజయ ఫలితం తమన్నా కెరీర్ లో మేలిమి మలుపు. తెలుగు కధానాయిక గానే చేలామని అవ్వుతూ తమిళ సినిమాల్లోను సక్సెస్ రుచి చూసింది ఆమె. మహారాష్ట్రాలో జన్మించిన తమన్నా తెలుగు సినిమాల్లోనే ఎక్కువ పేరుతెచ్చుకుందామె. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కానీ నాకు అలంటి పట్టింపులు ఏవీ లేవు. సినిమారంగంలో నాకు వచ్చిన పేరుకు భాష కు సంబంధం లేదు. సినిమా ముఖ్యం అంటే అంటోంది తమన్నా. మనం ఎదో అనుకుంటాం ఎదో జరుగుతుంది. బాలీవుడ్ లో నేను చేసిన మంచి సినిమాలు ఆడలేదు. ఆ తప్పు నా ఒక్క  దానిది కాదు మరి దక్షినాది సంగతేమిటి? మరి బాహుబలి సంగతేమిటి? దేశవ్యాప్తంగా పేరు వచ్చింది నాకు. దీనికి ఏమనాలో నాకు తోచడం లేదు అంటోంది తమన్నా. తమన్నా కెరీర్ చక్కగా వుంది. ఆమె తారా పదంలో దూసుకుపోతుంది.

Leave a comment