స్కూల్ చదువులో ఉండగానే రుతుక్రమం మొదలై అమ్మాయిలు చాలా కంగారు పడిపోతారు. అప్పటి వరకు పసి పిల్లల్లా ఇంట్లో ట్రీట్ చేసి వెంటనే వాళ్ళను పెద్దవాళ్ళుగా మార్చేయాలని చూస్తారు ఇంట్లో వాళ్ళు. తినే ఆహారం ,వేసుకునే డ్రెస్, మెలిగే పద్ధతులు ,వాళ్ళ స్నేహాలు అన్నింటిలోనూ ఆంక్షలోస్తాయి. ఈ పరిస్థితికి వాళ్ళు నిజంగానే ఆదుర్ధా పడతారు. శరీరంలో వస్తున్న మార్పులు పెద్దవాళ్ళ నిబంధనలు వాళ్ళను ఒత్తిడికి గురిచేస్తాయి. పెద్ద వాళ్ళు వాళ్ళకి ధైర్యం చెప్పి ,శరీరక పరిశుభ్రత గురించి తెలియజెప్పి, మంచి పోషకాహారం ఇచ్చి వాళ్ళకు అండగా నిలబడాలి. వాళ్ళ శరీరాన్నీ వాళ్ళు అర్ధం చేసుకొనేలా వాళ్ళకు సాయం చేయాలి. అ వయసులో వాళ్ళకు పెద్ద వాళ్ళ భరోసా కావాలి.

Leave a comment