జీవితంలో ఎన్నో భయాలు ఆందోళనల మధ్య మానసిక శక్తి మాయమైపోయి భయలే ఆలోచనలను ఆక్రమించేస్తూ ఉంటాయి. కానీ మనలో కలిగే భయాలు మన శక్తి ట్రెజర్ హీస్ వంటివి అంటారు విశ్లేషకులు. వాటిని సక్రమంగా వాడుకోవాలి. ప్రతి విషయాన్ని అనవసరంగా ఊహిస్తూ లేని పోని ఆలోచనలతో భూతాద్దం లోంచి చూడకూడదు. భయాలను సృజనాత్మాకంగా మలుచుకొంటే ఎంతో కొత్త శక్తి వస్తుంది.ఏ భయమైన వార్థాక్య భయం,వ్యాపారంలో నష్టం భయం,ప్రమాదాల భయం,పీడకలల భయం ,పిశాచీల భయం ఇలా లక్షా తొంభై భయాలు .ఈ భయాన్ని సరిగ్గా విశ్లేషించుకోగలిగితే గొప్ప మోటివేషన్ .పిరికిగా ఆందోళనగా ఆలోచిస్తే మొత్తం శక్తి మాయం అవుతుంది.ఉదాహారణకు వ్యాపారంలో ఉద్యోగంలోనూ నష్టపోతామని భయం మనసుని మెలిపెడితే ఇంకాస్త సృజనతో పనిచేసి ఉన్న స్థితిని వెయ్యింతలు మెరుగు పరచవచ్చు.ఇదే మోటివేషన్.

Leave a comment