లక్ష్మీ కల్యాణం విడుదల సమయంలో నేనెంత టెన్షన్ పడ్డానో ఎప్పుడు సౌత్ కు రాని అమ్మాయిని ముంబై నుంచి మదనపల్లె చేరుకుని చేస్తున్న ఈ సినిమా ఎలాంటి పేరు తెస్తుందోనని చాలా భయపడ్డాను అంటోంది కాజల్. ఇప్పుడు కూడా ఎదైనా మానసికమైన ఆందోళన కలిగితే వెంటనే ఆ రోజుల్నీ గుర్తు తెచ్చుకుంటాను. అప్పటి కంటే ఇప్పుడు వెయ్యి రెట్లు బావున్నాననే ఊహ నిజం నాకు రెట్టింపు శక్తి ఇస్తుంది. మనం అనుకొంటాం మొదటి సినిమా హిట్ అయితే ఇక వెనక్కి తిరిగి చూసుకొనక్కర్లేదు అని అందులో ఏం నిజం ఉంది. అది అదృష్టం అంటారు కానీ ఆ సక్సెస్ వెనక ఎన్నీ నిద్రలేని రాత్రులు ,కేరీర్ కోసం పడే ఆరాటం ఉంటుంది. ఒక వేళ ఫెయిల్ అయ్యా మనుకో మళ్ళీ తిరిగి నిలదొక్కుకోవటం ఈజీ కాదు. సక్సెస్,ఫెయిల్యూర్ ఏదైనా ,కష్టపడుతూనే ఉండాలి అంటోంది కాజల్.

Leave a comment