1940లో రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రపంచ జనాభాలో మూడోవంతు మంది జవాన్లు మరణించారు.అందులో ఇండియాలో 87,000 మంది అయితే కుట్టినాడ్ లో 650 మంది సోల్జర్స్ చనిపోయారు.ఈ నేపథ్యంలో తీసిన సినిమా ‘భయానకం’. మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేసి వికలాంగుడైన ఒక వ్యక్తి పోస్ట్ మాన్ గా కుట్టినాడ్ వస్తాడు. ఆ వూర్లో ఆర్మీలో చేరిన వాళ్ళు పంపే మనీ ఆర్డర్ లు పంచుతుంటాడు. అంతలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలు అవుతుంది.ఇక మరణ వార్తలు టెలిగ్రామ్ లు వస్తూ ఉంటాయి పోస్ట్ మాన్ కనిపించగానే అతను తెచ్చే దుర్వార్త వినలేక చెల్లాచెదురు అవుతుంటారు జనం. కేరళలోని ఒక మారుమూల గ్రామాల్లో రాకపోకలుకు ఎక్కువగా పడవలు ఉపయోగించ ఆవ్వదు, ఆ పోస్ట్ మాన్,అతను తెచ్చే వార్తలు చుట్టు తిరిగే ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయి. చూడవలసిన మంచి సినిమా ఇది.
Categories