హారర్ సినిమాలు చుస్తే బరువు తగ్గుతారట. యూనివర్సిటీ జిప్ వెస్ట్ మినిస్టర్ పరిశోధకులు సగటున గంటన్నర పాటు దెయ్యాల సినిమాలు చుస్తే 113 కేలరీలు ఖర్చు అయ్యి పోతాయని లెక్కలేసారు. ఊపిరి తిత్తుల ద్వారా మనం ఆక్సిజన్ పిల్చుకునే స్ధాయి పెరిగి గుండె వేగంగా కొట్టుకుని నాడీ వేగం పెరిగి రక్తం వేగంగా పరుగులు తీస్తే , ఆ సంమయంలో కొవ్వును కరిగించే రాకరకాల హార్మోన్లు ఉత్పత్తి అవ్వుతాయి. దీనివల్ల బేసిల్ మెటబోలిక్ రేట్ పెరిగి శరీరం లో కొవ్వు తాగీపోతుంది. ఎంత భయంకరమైన సినిమా చుస్తే అన్ని కేలరీలు ఖర్చు అవ్వుతాయిట అంటే ది హాయినింగ్ , ది ఎగ్జారిస్ట్ ఏలియన్ వంటి సినిమాలు చూడాలన్నమాట. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఇంకాస్త ఎక్కువ భయపడతారు. కనుక వాళ్ళకు ఇంకాసిన్ని ఎక్కువ కాలరీలు కరుగుతాయిట.

Leave a comment