Categories
WoW

బీటాకెరోటిన్ పుష్కలంగా వుండే గోల్డెన్ రైస్.

అంతర్జాతీయ వారి పరిశోధనా సంస్ధ భారత్ తో సహా వివిధ ప్రపంచ దేశాలతో కలిసి గోల్డెన్ రైస్ ను పండిస్తుంది. బియ్యంలో పసుపు కలిపినట్లు పచ్చగా ఉంటాయి ఈ బియ్యం గింజలు సాధారణంగా క్యారెట్ తో సహా ముదురు పచ్చ ఆకుకూరలు చిలకడ దుంపల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా దొరుకుతుంది. అయితే పండ్లు కూరగాయల పైన అధికంగా ఖర్చు పెట్టలేని పేద దేశాలతో విటమిన్ ఎ లోపం తో పసి తనంలోనే కంటి చూపును కోల్పోవడం తో పాటు మరణిస్తున్న పిల్లల సంఖ్య ఎక్కువే. అంచేత దక్షిణాసిన ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల్లో బియ్యం లోనే బీటా కెరోటిన్ ఉండేలాగా ఆ గోల్డెన్ రైస్ ను సాగుచేస్తున్నారు. మన దేశంలో మంచి కూరగాయలు, పండ్లు, క్యారెట్లు విస్తారంగా లభించే చోట మనం వీటిని ఎంత ఉపయోగ  పెట్టుకోవచ్చు ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చో ఆలోచించండి. మంచి ఆహారంపైన దృష్టి పెట్టండి.

Leave a comment