కాకరకాయ లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న దీనికి ఉండే చేదు రుచి వల్ల ఎక్కువమంది తినేందుకు ఇష్టపడరు.చేదుని తగ్గించేందుకు కొన్ని చిట్కాలను పాటించవచ్చు. కాకరకాయలు శుభ్రంగా కడిగి పై పొట్టు తీసి, ముక్కలుగా తరిగి ఆ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి ఓ అరగంట పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఈ ముక్కలను గట్టిగా పిండితే చేదు ఉండదు.చెక్కు తీసిన కాకరకాయ ముక్కలను పెరుగులో నాననిస్తే చేదు తగ్గుతుంది.బెల్లం చక్కెర వేసి కూడా ఉండి నా పేరు అనిపించదు బంగాళదుంపలు, ఇతర కూరగాయలతో కలిపి వండుకున్న చేదు తగ్గి కూర రుచిగా ఉంటుంది.

Leave a comment