వెండి పూజా వస్తువులకు ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉంది. ఇవి వాడుకునేందుకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు కూడా చక్కగా ఉన్నాయి. అందం గట్టిదనం తేలికగా వివిధ ఆకృతుల్లో కి ఒదిగి పోయే గుణం వెండి కి మాత్రమే ప్రత్యేకం. లైట్ వెయిట్ తో చాలా ఆడంబరంగా అందంగా ఉన్నాయి దీపాలు, ప్లేట్లు, పూలసజ్జ లతోపాటు పూజకు వాడే పూలు అగ్గి పెట్టి బియ్యం గింజల వరకూ వెండివే. శుభసూచకంగా నిల నిలబెట్టే అరటి మొక్కలు, కొబ్బరికాయలు, చెరుకు ముక్కలు ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చే బుట్టలు రోళ్లు ఇవన్నీ వెండిలో దొరుకుతున్నాయి. వీటిని తాంబూలంతో పాటు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తున్నారు పదహారు ఫలాల నోముకి పండ్లు, లక్ష్మీ పూజకు కలువ పూల తో సహా వెండి వస్తువులు మార్కెట్ లో ఉన్నాయి.

Leave a comment