అనేక పోషక పదార్ధాలున్న ధాన్యం కాంతివంతమైన చర్మాన్ని ఇవ్వటంలో ముందుంటుంది. సహజ స్థిరమైన శరీర కాంతి కోసం బియ్యం పిండి లో పాలు కలిపి స్పా ట్రీట్మెంట్ లో వాడతారు. పెద్ద పెద్ద ఒబెరాయ్ బాలినీస్ స్పా ముంబై లోని నారిమన్ పాయింట్ స్పా ల్లో ఈ ట్రీట్మెంట్ ను అతిధుల కోసం ఇస్తారంటే బియ్యంలో శరీర లావణ్యలను పెంచే పోషకాలు ఉండటమే కారణం. మస్సాజ్ తర్వాత స్క్రబ్బింగ్ చేయటం వల్ల  మృత కణాలు పూర్తిగా పోయి శరీరం  శుభ్రపరుస్తుంది. మంచి మెరుపు నిగారింపు పటుత్వం వస్తుంది. ఇదే బియ్యపిండి పాలు మిశ్రమానికి అలొవెరాని కలిపి పెదవులు ఎండిపోకుండా తేమతో మెరిసిపోయేందుకు వాడతారు. తాజాగా ఉన్న  బియ్యపిండి రైస్ బ్రాన్ నూనె లో రకరకాల పదార్ధాలు కలిపి రకరకాల ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. ఆర్గానిక్ కొబ్బరి షియా బటర్ లతో కలిపి డ్రై స్కిన్ కు అధిక తేమను ఇచ్చేందుకు వాడతారు. బియ్యం పిండి శరీరానికి రుద్దుకొనే సబ్బు లాంటిది. బియ్యం  పిండి తేనె  పాలు మిశ్రమం ఫేస్ ప్యాక్ గా చక్కగా ఉంటుంది. ఈ మిశ్రమాన్నే బాడీ స్క్రబ్బర్ లాగా ఉపయోగిస్తారు.అయితే శరీరానికి దీన్ని మృదువుగా అప్లయ్ చేయాలి. బియ్యం వండి తినేందుకే  కాదు  మంచి బ్యూటీ ట్రీట్ మెంట్ కూడా.

Leave a comment