బియ్యం, పప్పులు వంటి డబ్బాలో మూతపెట్టి వుంచినా పురుగులు పడుతూ వుంటాయి. వదులుగ మూత వుంచిన డబ్బాలో బిర్యానీ ఆకు,లేదా కాసిని కరివేపాకులు వుంచితే పురుగు పట్టవు. లవంగం కీటక నాశినిగా పని చేస్తుంది. కొన్ని లవంగాలు బియ్యం,పప్పుల్లో వేసిన  మంచిదే పొట్టు తీయని వెల్లుల్లి పాయను బియ్యంలో వేసి అవి ఎండి నట్లు అయ్యేదాకా వుంచి,తర్వాత తీసి కొత్త పాయలు వేయాలి. ఈ ఉల్లి పాయల వాసనకు పురుగులు రావు పురుగులు ఎక్కువగా అనిపిస్తే డబ్బాలను ఎండలో వుంచాలి లేదా కాసేపు ఎండలో ఆరబోయాలి . పురుగులు పోయాక డబ్బా శుభ్రం చేసి మళ్ళి నిల్వ చేసుకోవచ్చు . కొన్ని కర్పూరం బిళ్ళలను మూటగట్టి బియ్యంలో వేసిన పురుగులు రావు.

Leave a comment