హైదరాబాద్ కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ రామగిరి సారిక భగవద్గీతను బియ్యం గింజలపై రాసి రికార్డు సృష్టించింది.2009లో లక్ష మందితో కలిసి ఒకేసారి కీర్తనలు ఆలపించినందుకు ఆమెకు గిన్నిస్ బుక్ ఆఫ్  రికార్డ్స్ లో చోటు దక్కింది. 4042  బియ్యపు గింజలు ఉపయోగించి 150 గంటల్లో భగవద్గీత రాసింది సారిక. ఇప్పటి వరకూ సారిక రెండు వేలకు పైగా కళాకృతులు బియ్యపు గింజ లపై చిత్రీకరించింది నువ్వుల గింజల పైన కూడా కళాకృతులు  చెక్కిందామె.పేపర్ కార్వింగ్ మిల్క్ ఆర్ట్ వంటివి కూడా ఆమె అద్భుతంగా చేయగలదు.భారత రాజ్యాంగ పీఠికను వెంట్రుకలపై చిత్రించి గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ప్రశంశలు అందుకుంది రామగిరి సారిక .

Leave a comment