కళ్ళ కింద నల్లని వలయాలు చిన్న జాగ్రత్తలతో పోతాయి. కొబ్బరి నూనె లేదా ఆల్మండ్ ఆయిల్ తో కళ్ళకింద నెమ్మదిగా మునివేళ్ళతో మసాజ్ చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కొబ్బరి తురుము లో కొద్దిగా నిమ్మరసం కీర దోస గుజ్జు తీసుకుని టీ స్పూన్ క్రీమూ  కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి మాస్క్ లాగా వలయాల పై అప్లయ్ చేయాలి ఇరవై నిమిషాల తర్వాత పాలతో కడిగేయాలి. అలాగే టమాటో జ్యూస్ లో నిమ్మరసం కలిపి కూడా కళ్ళ కింద అప్లయ్ చేయవచ్చు. బంగాళదుంప వేస్ట్ ని కళ్ళకింద పెట్టుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

Leave a comment