Categories
ఇవ్వాళ్టి ఫ్యాషన్ ట్రెండ్ ముందు కనబడుతుంది బో ప్యాషన్ .దుస్తులు ,నగలు ,చెప్పులు, బ్యాగ్స్ అన్నింటిలోనూ ఈ బో స్టైలిష్ లుక్ లో కనిపిస్తుంది. సాయంత్రపు పార్టీలకు ఆది కొత్త లుక్ ఇస్తుంది. చీరెలు, లెహాంగా, బ్లౌజ్ ల్లో వెనుకాల కట్టుకొనే డారీలకు బదులుగా ఈ బో తో ముస్తాబవుతున్నారు. సాధాడ్రెస్ లకు కొత్త అందం కోసం అదే రంగులో బో అమరిస్తే యూత్ ఫుల్ లుక్ వస్తుంది. గౌన్లూ,పలాజోలు ,మినీస్కర్టులూ నడుము దగ్గర ఒక బెల్ట్ ,బో ఉంటే చాలు ,అదీ వస్త్రంతో చేసిన బెల్ట్ పై బో అయరిస్తే సరికొత్తగా కనిపిస్తుంది. తల పిన్నులు, స్టడ్స్,చెయిన్ లకు బో ఫ్యాషన్ అమరిగ్గా కుదిరింది.