అలసట వల్లనో, ఒత్తిడి వల్లనో జ్వరం వచ్చినట్లు అనిపిస్తే ఇంటి వైద్యం మంచి ఫలితం ఇస్తుంది. ఆహారంలో పాత బియ్యం, బార్లీ, వరి పేలాలు, పాలు, వెన్న, పటిక బెల్లం, గుమ్మడి, అరటి తీసుకుంటూ ఉండాలి. కారం,చేదు,మసాలాలు వాడకుండా ఉండాలి. కారం,చిప్స్,గ్రేవి కూరలు వంటివి శరీరంలో నీటిని ఉపయోగించుకుంటాయి. దానితో జ్వరం వచ్చినంత వేడిగా అనిపించవచ్చు అప్పుడు ద్రవ పదార్ధాలు ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ మంచినీళ్ళు తాగాలి. కొబ్బరినీ ళ్ళు, చెరుకు రసం, నిమ్మరసం, మజ్జిగ, పుచ్చకాయల రసం ఇవన్ని శరీరానికిమేలు చేసేవే. గంధం పొడిలో పటిక బెల్లం పొడి కలిపి తాగుతూ ఉంటే మంచిది. లేత గుమ్మడి కాయ రసం తీసి పటిక బెల్లం కలిపి తాగితే వేడి తగ్గుతుంది.

Leave a comment