శరీరానికి ఓ భాష ఉంటుంది. నోరు చెప్పని ఎన్నో విషయాలు శరీరం నిస్సంకోచంగా వ్యక్తం చేస్తూ ఉంటుంది. అసహనంగా కదలటం నిర్లక్ష్యాన్ని సూచించేలా కూర్చునే పద్ధతి,టెన్షన్ గా గోళ్ళు కొరకటం స్థిమితంగా నిలబడలేక పోవడం ఇవన్నీ ఎదుటి వాళ్ళకు పట్టించేస్తాయి.బయట ఎక్కువ మంది మధ్య ఉన్నప్పుడు చాలామంది కళ్ళు చెవులు మన పై కేంద్రీకృతమై ఉంటాయి. కాబట్టి మాట్లాడే భాషతో పాటు ఈ బాడీ లాంగ్వేజీ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను నొప్పించే పరుష పదాలు వాడకూడదు ముఖ్యంగా పిల్లల ముందు దురుసు భాష ప్రయోగాలు అసలే వద్దు బాడీలాంగ్వేజీ విషయంలో మరి జాగ్రత్త కావాలి. ఎదుటి వాళ్లకు వేలు చూపించటం నిర్లక్ష్యాన్ని సూచించే హస్త భంగిమల వంటివి ఎబ్బెట్టుగా ఉంటాయి. నోరు మాట్లాడుతూ ఉంటే నొసలు వెక్కిరిస్తుంటాయి వంటి సామెతలు దృష్టిలో పెట్టుకోవాలి బాడీలాంగ్వేజీ విషయంలో అత్యంత శ్రద్ధగా ఉండటం చాలా అవసరం.

చేబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment