సాధారణంగా తమకున్న చర్మ సమస్యలు, ఇతర అనారోగ్యాల గురించి బయటకు చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఇక తెరపై వినోదాన్ని పంచే ముద్దుగుమ్మలూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే నిజంగానే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు దాన్ని దాయాల్సిన పని లేదంటోంది ఫెయిర్‌ అండ్‌ గ్లో బ్యూటీ యామీ గౌతమ్‌. ఈ నిజాన్ని ఇటీవలే గ్రహించానని, అందుకే తనకున్న తీవ్ర చర్మ సమస్య గురించి బయటపెట్టే ధైర్యం చేశానంటోంది. అయినా తాను ఎంతో అందంగా ఉన్నానంటూ బాడీ పాజిటివిటీని చాటుకుంటూ తన చర్మ సమస్య గురించి ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది యామీ. ఇలా ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు పలువురు స్పందిస్తూ ఆమె ధైర్యాన్ని, నిజాయతీని ప్రశంసిస్తున్నారు.

Leave a comment