బొల్లి ఇతర అనారోగ్యాలలో ఒకటి,ఇది బయటికి కనిపిస్తుంది. అంతే మన శరీరాన్ని ప్రేమించటం మొదలు పెడితే మనం మనకు అందంగా కనిపిస్తాం. ఈ దిశగా ఆలోచించి నేను అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టాను బొల్లి గురించి మాట్లాడి మొదటి వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాను. ఇంస్టాగ్రామ్ లో నా భావాలు షేర్ చేశాను అంటోంది బెంగుళూరు కు చెందిన ప్రార్ధన జగన్.  ఇప్పుడామె ఫ్యాషన్ ప్రపంచంలో ప్రభంజనం 11 సంవత్సరాల వయసులోనే నా మొహం పై బొల్లి మచ్చలు వచ్చాయి ఎంతో కుమిలిపోయాను బిడియ పడ్డాను చివరకు తేరుకున్నాను ఎల్లే ఇండియా వంటి ప్రముఖ మ్యాగజైన్ కు 25 వ వార్షికోత్సవ సంచికకు ముఖచిత్రంగా నా ఫొటో వచ్చింది మోడలింగ్ లో ప్రపంచంలో ఓస్థాయిని అందుకోగలగాను అంటోంది ప్రార్థన జగన్.

Leave a comment