Categories
WhatsApp

బొమ్మలు సర్ధటంలో పిల్లల సాయం.

మరీ చిన్న పుల్లలున్న ఇంట్లో గృహిణి, వాళ్ళు ఆడుకుంటూ అటు ఇటు పారేసిన బొమ్మలు, పేపర్లు, పుస్తాకాలు సర్దటంతో నే టైమ్ మొత్తం సరిపోతుంది. ఇవి ఒక్క పద్దతిలో సర్దుకుంటే ఇలా రోజంతా శ్రమ పడటం తప్పుతుంది. పిల్లలకి లేగాన్,యాక్షన్ ఫిగర్స్, ఇతర బొమ్మలు ఎన్నో ఉంటాయి. కొత్త బొమ్మ పైన ఇష్టం కనీసం రెండు మూడు రోజులైనా వుంటుంది. అలాగే బొమ్మలను పారదర్శకంగా వుండే డబ్బాల్లో ఉంచితే వాళ్ళు ఏ బొమ్మ అడిగితె దాన్ని మాత్రం తీసి ఇవ్వొచ్చు. పుస్తకాలు కూడా వాళ్ళకు అందుబాటులో లేకుండా కాస్త ఎత్తులో ఉంచేసి అడిగిన పుస్తకం మాత్రం చేతిలో పెట్టడం బెస్ట్. అలాగే ఇంట్లో వాడకుండా మడత బెట్టిన కుర్చీలు, టేబుల్లు స్టోర్ రూమ్ లోనే వుంచాలి. వదిన తర్వాత మడత బెట్టే విషయంలో పిల్లలకు పని చెప్పాలి. ఎప్పటి వస్తువు అప్పుడు దాని స్థానంలో ఉంచితేనే కొత్తది ఇస్తానని గట్టిగా చెప్పడం చాలా అవసరం.

Leave a comment