కొరియన్ సంస్థ లైచో కొత్తరకం కప్పుల్ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది. చూసేందుకు మాములుగా ఉంటాయి. సాదాగా కనిపించే కప్పుని సాసర్ పైన పెట్టగానే పువ్వులు ,ఆకులు చిలకలు సింహాలు కనిపిస్తాయి . ఈ మిర్రర్ కప్పుల్ని సిల్వర్ నైట్రేట్ పూత పూసి తయారు చేస్తారు. అందువల్ల కప్పుల ముందు ఏముంటే అవి అద్దంలో లాగా కనిపిస్తాయి సాసర్ పైన ఒక కోణంలో ఒక్క బొమ్మ పెట్టేసరికి,కప్పు సాసర్ పైన పెట్టగానే ఆడిజైన్ కప్పు పైన ఇంకో కోణంలో కనిపిస్తుంది. సాసర్ పైన కొన్ని చుక్కలే కనిపిస్తాయి. అవికాస్తా కప్పు అద్దంలో పక్షి ఎగురుతున్నట్లు గుర్రం పరుగెత్తుతున్నట్లు కనిపిస్తూ వుంటుంది.

Leave a comment