ఈ పరుగుల జీవితంలో అన్ని మరిచిపోతూ ఉంటాం. ఇంట్లో పెంచుకునే ఏ మనీ ప్లాంట్ కో నీళ్లు పోయడం కూడా గుర్తుకు రాకపోవచ్చు, ఒకసారి నీళ్ళు పోస్తే చాలా కాలం నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు. దానిలో అసలు కుండిల్లో నీళ్ళు ఉన్నాయో లేదో అర్ధం కాదు. ఐతే ఈ నీళ్ళ సంగతి గుర్తు చేసేలా వచ్చాయి స్క్వీరల్ సెల్ఫ్ వాటరింగ్ పవర్ హీట్. ఈ కుండికి ముందు వైపు ఒక రంద్రంలో ఉడత బొమ్మ ఉంటుంది. కుండిల్లో నీళ్ళు సరిపడ ఉంటే బొమ్మ కనిపిస్తూ ఉంటుంది.నీళ్ళు అడుక్కుపోయి ఉంటే బొమ్మ కూడా కిందకు పోతూ ఉంటుంది.బోమ్మ కనిపించకపోతే నీళ్ళు పోయాలని గుర్తుకు వచ్చి నీళ్ళు పోయడం ఈజీ కదా.

Leave a comment