ఈ ఏడాది ఫోర్బ్స్ ప్రకటించిన ‘అండర్–30’ జాబితాలో సలోని నభేతి పేరు చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని అల్వాల్ లో మార్వారి జైన్ కుటుంబంలో జన్మించిన సలోని తను ఇంటర్న్ షిప్ చేస్తున్నప్పుడు పర్యటించిన గ్రామాల్లో గిరిజన ల ఆర్ధిక పరిస్థితి చూసి వారి కోసం ‘బాన్ సూలి’  అనే స్టార్టప్ ప్రారంభించింది. బాన్ అంటే వెదురు సూలీ అంటే నగలు. డ్యాంగ్ జిల్లా గిరిజన మహిళలకు అక్కడ దొరికే వెదురుతో జ్యువెలర్స్ తయారు చేయటం నేర్పించింది. వెదురు కు రాళ్లు రత్నాలు పూసలు కలిపి 7 నుంచి 10 గ్రాముల లోపు బరువుతో తయారుచేసే ఈ నగలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంకా లైట్ స్టాండ్ లు రాఖీలు కిచెన్, గృహాలంకరణ వస్తువులు కూడా బాన్ సూలి యాప్ లో విక్రయిస్తారు. సలోని కృషికి ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి.

Leave a comment