బోనం  ఉత్సవం హైదరాబాద్ నగరంలో మొదలైంది. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు ఇక ఆలయాల్లో బోనాలను ఈ నెల రోజుల్లో సమర్పించుకుంటారు భాగ్యనగరానికి సంబంధించి ఇది ఇంటింటి ఉత్సవం. పట్టు వస్త్రాలు ధరించిన మహిళలు తలపై నైవేద్యం కుండలను అమర్చుకొని డప్పు చప్పుళ్లకు లయ బద్దంగా నృత్యం చేస్తూ మహంకాళి ఆలయాలకు చేరుకుంటారు. కర్నాటక,రాయలసీమలో కూడా ఈ ఉత్సవం చేసే సంప్రదాయం కనిపిస్తుంది. భారతీయుల విశ్వసాల్లో శక్తి ఆరాధన అతి ప్రాచీనం ఆద్యాంతాలు లేని సృష్టిలో శక్తి నిండి ఉంది. రూపం లేని పదార్ధానికి రూపాన్ని జ్ఞానాన్ని ప్రసాదించింది దేవి రూపమైన శక్తేనని అలాగే ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించే దేవత కూడా శక్తేనని మానవుడి నమ్మిక. అందుకే ఆ శక్తి కి రూపమైన అమ్మవారికి బోనాలు సమర్పించుకొంటారు. బోనం కుండలో బియ్యం పచ్చసురా బెల్లం వేసి వండుతారు. బోనానికి వేపమండలు కట్టటం,బోనం ఎత్తుకొన్నవారి చేతిలో వేప మండలు ఇవన్నీ రోగనివారణ కోసమేకదా. బోనం మీది దీపం క్రిమి కీటకాలాన్ని చంపేస్తుంది. ఆషాఢం లో అమ్మవారి బోనానికి ఎంతో శాస్త్రీయత ఉంది. బోనాల పండగ కు 346 ఏళ్ల చరిత్ర ఉంది. 1675 లో గోల్కొండ ను పరిపాలించిన అబుల్ హసన్ కుతుబ్ షా కాలంనుంచే బోనాల పండగ హైద్రాబాద్ లో ప్రారంభమైంది సాంస్కృతికంగా తెలంగాణ జాతీయతను తీర్చిద్దిద్దింది బోనాల పండగే.

Leave a comment