సాహిత్యాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ప్రతి రోజు కాసేపైనా ఏదైనా పుస్తకం చదవకుండా నిద్రపట్టని వాళ్ళు ఎంతోమంది .అంత ఇష్టమైన పుస్తకాలు కొని వాటిని ఒక క్రమపద్ధతిలో అమర్చుకోవడం కూడా ఒక చక్కని ఆర్ట్. డ్రాయింగ్ రూమ్ కి ఎంతో ఖరీదైన వస్తువులు కూడా ఇవ్వని ఆనందాన్నిస్తాయి పుస్తకాలు. పుస్తకాన్ని చక్కగా అమర్చుకుంటే ఏ పుస్తకం ఎక్కడ ఉందో చేతికి వస్తుంది. పుస్తకాలను రంగుల ఆధారం తో అమర్చుకోవచ్చు గట్టి అట్టలు ఉన్న బాక్స్ ఒక చోట పేపర్ కవర్ ఉన్న బుక్స్ ఇంకోచోట అమర్చుకోవచ్చు. సబ్జెక్ట్ ఆధారంగా పుస్తకాలు విభజించి అమర్చుకుంటే అవసరం అనగానే ఇలా వెంటనే చేతిలోకి తీసుకోవచ్చు. ఇష్టమైన పుస్తకాలు ఒక రాక్ లో ఉంచేస్తే అందుబాటులో ఉంటాయి .రిఫరెన్స్ కోసం ఈజీగా చేతిలోకి తీసుకొనే వీలుంటుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అమర్చుకుని లిస్ట్ రాసి సెల్ఫ్ కు అతికిస్తే అదో పద్ధతి పుస్తకాల ఎత్తు బరువు సైజు బట్టి సెల్ఫ్ లో పెట్టుకుంటే బుక్ చేసుకునేందుకు వీలుగా ఉంటాయి.  రచయితల పేర్లు  ఫిక్షన్ నాన్ ఫిక్షన్ బుక్స్ విడివిడిగా సర్దుకోవచ్చు పుస్తకాలు కొనటం తోనే సరిపోదు వాటిని కాపాడుకోవాలి దుమ్ము ధూళి చేరకుండా ప్రతిరోజు డస్టింగ్ చేయాలి చక్కని అద్దాల్లో అందంగా పుస్తకాలు కనిపించాలి అంటే దుమ్ము లేకుండా, సైజుల వారీగా అమర్చుకుంటే చూడగానే ఆకట్టుకుంటాయి. డ్రాయింగ్ రూమ్ కి గొప్ప అందం ఆకర్షణ వస్తుంది మన అభిరుచిని ప్రతిబింబిస్తాయి పుస్తకాలు.

Leave a comment