ఖరీదైన ఇంటీరియర్లు గొప్ప కళాత్మక వస్తువులతో పాటు ఇంటికి ప్రత్యేక అందం ఇవ్వ గలిగింది పుస్తకాలే. వేలాది రూపాయలు ఖర్చు చేసి కొనే పుస్తకాలు క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే పాడవుతాయి. ఫెదర్ బ్రష్ తో రోజు దుమ్ము దులపాలి. లేదా వ్యాక్యూమ్ క్లీనర్,డాస్టింగ్ బ్రష్ యాక్ససరీతో దుమ్ము మురికి తొలిగించాలి. ఐదారు నెలలకు ఓ సారయినా బుక్స్ తీసి వాటి మధ్యలో పట్టే దుమ్ము తుడిచేయాలి పుస్తకానికి బుజు పడితే దానిపై బేకింగ్ సోడా చల్లి కొన్ని గంటలు వదిలేసి బ్రష్ తో తుడిచేయాలి. బొద్దింకలు,సిల్వర్ ఫిష్ లు చెదలు బుక్స్ ని నాశనం చేస్తాయి. చేద నివారణ సంస్థ సలహాలతో వాటిని నిర్ములించవచ్చు షెల్ఫ్ లో పుస్తకాలు నిలువుగా సర్ధితే వాటి ఆకారం దెబ్బతినదు.

Leave a comment