Skip to content
Vanitha Blog

Vanitha Blog

Vanitha Blog

Menu
  • Home
  • Navvithe Navvandi
  • Gagana
  • You&Me
  • Nemalika
  • WhatsApp
  • WoW
  • Sogasu Chuda Tarama
నీహారికా, నువ్వే కాదు నీ వయసులో ఏ అమ్మాయిని పలకరించినా బోర్ అంటుంటారు. మార్పులేని జీవితమే కదా బోర్ కొట్టేది ప్రతి రోజు కొత్తగా మలుచుకుంటే ఎలా ? అనద్దు. మనకి ఇషటమైన పనులు మనస్ఫూర్తిగా చేస్తూ పోవాలి. హాయిగా స్నేహితులతో మాట్లాడటం కలుసుకోవటం మంచి పుస్తకాలు చదువుకోవటం మంచి హాబీలు డెవలప్ చేసుకోవటం సంతోషంగా నవ్వటం ఇవన్నీ జీవితంలో భాగంగా ఉంటె బోర్ అన్న పదం ఎక్కడుంటుంది. ఇంట్లో మీ అమ్మకి సాయం చేయి వంట ఆడవాళ్ళ పనేలా అన్న సాధారణంగా అంటాం కానీ వంట ఆసాకులు ముందు ఎవరికి వాళ్ళ అవసరమే కదా. ఇందులో మగ ,ఆడ తేడా లేదు . చక్కగా వండుకోవటం తినటం కూడా రావాలి. ఇల్లు అనుకరణ పుస్తకాలని అందంగా అమర్చుకోవటం కొత్త వస్తువులు తయారుచేయటం ఎన్నో ఆర్ట్ లు కనిపిస్తాయి. ఎదో ఒకటి నేర్చుకోవటం చివరకు పాటలు పాడటం ప్రాక్టీస్ చేయమ్మాయి . ముందు నీ చెవులకి తర్వాత విన్నవాళ్ళకీ ఆనందం. ఏమంటావు ఏదీ చేయకుండా రికామీగా కూర్చుని బోరంటే మాత్రం తప్పే.
Categories
Nemalika

బోర్ అన్న పదానికి చోటివ్వద్దు

January 17, 2017June 16, 2017
1 min read

https://scamquestra.com/21-finansovye-afery-questra-world-i-atlantic-global-asset-management-agam-questraworldes-atlanticgames-44.html

By admin

View all of admin's posts.

Post navigation

Next: ఈ ఆందోళన అనివార్యమా ?
వయస్సు మీదపడుతోందన్న ఆందోళన తో ఈ మధ్య డిప్రెషన్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఒక మెడికల్ అధ్యయన రిపోర్ట్ చెపుతోంది. అసలు జీవితమే గొప్ప సెలబ్రేషన్. ఇందులో వయసు వర్రీలు అవసరంవుండదు. అస్తమానం యవ్వనం మాత్రం ఉందనుకోవటం అసహజం. మన కళ్ళముందే ఉదయాన్నే పూసిన పూవు సాయంటానికి కళ తప్పి రాలిపోతుంది. అది ప్రకృతి ధర్మం.ఏజింగ్ ఎక్కువ అవకాశాలు రహదారి వంటిది. దీనికి ఏ విధమైన పరిధిలు వుండవు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని హుందాగా ఎనెర్జీ తో కొనసాగించవచ్చు. పెరిగే కొద్దీ విజ్ఞానం పెంచుకోవాలి. ప్రతి అంశాన్ని చవిచూసిన అనుభూతులతో వాస్తవాన్ని ఆస్వాదించాలి. భర్తతో పిల్లల్తో ఎక్కువ సమయం గడపచ్చు. లేదా జీవితం మొత్తం హడావుడి పరుగులతో సొంతానికి కొద్ది సమయం కూడా చేసుకున్న రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకుని ఆలా పక్కకుపెట్టిన ఎన్నో పనులు ఇప్పుడు మొదలు పెట్టవచ్చు. 60 ఏళ్ల వయసులో సంగీతం నేర్చుకున్న పరీక్షలకు కట్టినా కొత్త ప్రదేశాలకు వెళ్లినా ఏదైనా చేసేందుకు సమయం వుందనే పాజిటివ్ దృక్పధంతో ఉండాలి.
Next: రసాల కంటే పండ్లే బెటర్
సాధారణంగా పిల్లలు ఉదయం పూట పాలు సాయంత్రం పూట స్కూలు నుంచి రాగానే పండ్ల రసాలు ఇస్తుంటారు తల్లులు . పండ్ల రసం ఆరోగ్యవంతమైన ఆహారంగా భావిస్తుంటారు. విటమిన్ సి కాల్షియం కు పండ్ల రసాలు మంచి ఆధారమే అయినా ఇందులో చాలా లోపాలున్నాయి. నాలుగు పండ్లు రసం తీస్తే కానీ గ్లాసుడు రసం కాదు. కానీ ఇందులో గుర్తించదగిన ప్రోటీన్లు ఫ్యాట్ పీచు విటమిన్లు వుండవు. ఇవన్నీ ఎదిగే పిల్లలలకు పండ్ల ద్వారా లభించే పోషకాలు. కానీ పండ్ల రసాలు కార్బోహైడ్రేట్స్ చక్కెరలుంటాయి. కనుక పిల్లల్లకు వీలైనన్ని పండ్లను యధాతధంగా ఇవ్వటమే మంచిది. పైగా రుచి కోసం పండ్ల రసం లో కలిపే చక్కెర కూడా అనారోగ్యమే. పిల్లలు ఇష్టంగా తాగే ప్యాకెట్లలో ఉండే పండ్ల రసాలు ఎక్కువ ఉప్పు చక్కెర రసం పాడవకుండా నిల్వ చేయటం కోసం కలిపే రసాయనాలు ఉంటాయి . ఈ రకం పండ్ల రసాలు వల్ల మేలు కంటే కీడే ఎక్కువ. సురక్షితమైన మార్గం వలచిన బత్తాయి దానిమ్మ ఆలా ఇవ్వటమే.

Related Post

దేని కష్టాలు దానివే.

January 6, 2018
0 mins Read

ఫిట్ నెస్ ఫుడ్ ఇదే

September 26, 2018
0 mins Read

అందమైన డిజైన్ లు

June 30, 2018June 30, 2018
0 mins Read

  చర్మం మెరుపు కోసం 

October 18, 2019October 17, 2019
0 mins Read

Leave a comment Cancel reply

You must be logged in to post a comment.

Copyright © 2020 All Rights Reserved.

Copyright © 2020 All Rights Reserved.