బాయ్స్ డోన్ట్ క్రై  (Boys Don’t Cry) పేరుతో నవల రాసింది మేఘన పంత్. ముంబై లో చదువుకొని ఎన్ డి టివి లో రిపోర్టర్ గా పనిచేసింది మేఘన. ఆమె కథ రచయిత్రి. 2007 లో వివాహం చేసుకొని 2012 లో పెళ్లి నుంచి బయటకు వచ్చింది. స్త్రీల తరఫున అనేక వ్యాసాలు రాసింది. ఆమె నవల ది టెర్రీ బుల్ హారిబుల్ సినిమా గా రానున్నది బాయ్స్ డోన్ట్ క్రై నవల మేఘన జీవిత కదే మగ పిల్లల పెంపకంలో వాళ్ళని స్త్రీలతో ఎలా ప్రవర్తించినా పర్లేదు అన్న ధోరణి నింపుతారు. వాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదని ఏడుపు ఆడవాళ్లకు చెందినదని ఆలోచనే వాళ్ళలో ఉంటుంది. కానీ కన్నీళ్లు ఒక భాష. ఒక స్వాంతన,దాన్ని ఎవరైనా స్వేచ్ఛగా వాడుకోవాలి. అందుకే నా నవలకు ఆ పేరు పెట్టాను అంటుంది మేఘన పంత్.

Leave a comment