మెదడు మోకాల్లో ఉంది అని సాధారణంగా తెలివి తక్కువ వాళ్ళని తిట్టే ఉపయోగంలో ఉంది . కానీ మెదడు బలం మోకాళ్లలోనే ఉంటుందంటున్నాయి అధ్యయనాలు . కాళ్ళు బలంగా ఆరోగ్యం గా ఉంటేనే మెదడు చురుగ్గా పనిచేస్తుందని చెపుతున్నారు . పది సంవత్సరాల పాటు జరిగిన ఈ అధ్యయనంలో ప్రతి రోజు వ్యాయామం చేసేవాళ్ళ మోకాళ్ళు చాలా బలంగా ఉండడమే కాకుండా మెదడు కూడా అద్భుతంగా పనిచేస్తుందని రుజువైంది. వ్యాయామం చేస్తూ శరీరాన్ని పిట్ గా ఉంచుకొనే వాళ్ళు మెదడు వ్యవస్థలన్నీ ఎంతో బావున్నా యని ,ముఖ్యంగా కాళ్ళ ఆరోగ్యం సరిగ్గా ఉంటే మెదడు షార్ప్ గా ఉందని గుర్తించారు .

Leave a comment