భవనాల మధ్యలో అందం కోసం చక్కని పూలతోటలు,పార్క్ లు ఏర్పాటు చేస్తుంటారు కానీ ఏకంగా తోటలోనే ఊరు కడితే ఎలా ఉంటుంది.డెన్మార్క్ లోని కోపెన్ హెగన్ దగ్గర లో ఉన్న బ్రాండ్ బై గార్డెన్ సిటీ గ్రామాన్ని చూస్తే పచ్చని చెట్లతో అసలా ఊరే పెద్ద ముగ్గులా ఉంటుంది. పదుల సంఖ్యలో బండి చక్రాల్లా పరచుకొన్న తోటలు ఆ మధ్యలో ఎంతో అందంగా తీరుగా నిర్మించిన ఇల్లు ఎంతో అద్భుతం అనిపిస్తుందీ గార్డెన్ సిటీ .ఎంత అందంగా చూడ చక్కగా డిజైన్ చేశారంటే ఇదేదో నిన్న మొన్న నిర్మించారు అనుకుంటే పొరపాటు పడ్డట్టే .స్థానిక ప్రభుత్వం 1964లో ఈ గార్డెన్ సిటీని నిర్మించింది నగర జీవితం విసుగొస్తే కొన్నాళ్ళు ప్రకృతి ఒడిలో జీవించాలనుకుంటే ఈ గార్డెన్ సిటీ కి రావచ్చు. ఈ గ్రామం కోసం ఆర్కిటెక్ట్ ఎరిక్ మై గిండ్ 24 గుండ్రని తోటలను ఏర్పాటు చేశారు.ఒక్క తోటనీ 50 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఉండేట్లు డజనుకు పైగా ఫ్లాట్స్ గా విడగొట్టి అందులో ఇల్లు నిర్మించారు .ఈ ఇళ్ల కు ఊరిలో 20 కిలోమీటర్ల దూరంలో నివసించే వాళ్ళకే అమ్ముతారు .అంతకన్నా దూరం ఉంటే అద్దెకు తీసుకోవచ్చు .ఈ గార్డెన్ సిటీ ఇళ్ల మధ్యలో ఎక్కడ గోడలు ఉండవు .ఇక్కడ అందరూ కలిసి కాలక్షేపం చేసేలా ఏర్పాటు చేశారు. ఈ తోటలో ఊరికి ఎంతోమంది టూరిస్ట్ లు వస్తూ ఉంటారు.
Categories