సాధారణంగా కొన్ని వస్తువులు కొనేటప్పుడు మనం బ్రాండ్ కే ప్రాధాన్యత ఇస్తాం. మంచి క్వాలిటీ వుండటం అంటే మంచి కంపెనీ అనే కదా అర్ధం. ఇప్పుడు కంపెనీ కాకుండా వస్తువులో వాడిన పదార్ధాల ను బట్టి ఆ వస్తువుని ఖరీదు చేయండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫలానా బ్రాండ్ కొబ్బరి నూనె, సబ్బులు, క్రీములు అనుకోండి. అందులో కంటెంట్ చదువుకోండి అంటున్నారు. ఉదాహరణకు ఒక లిప్ స్టిక్ కొంటె అందులో వాడిన జాబితా తప్పనిసరిగా ప్యాకింగ్ బాక్స్ పైన వుంటుంది. బ్రాండెడ్ కంపెనీలు ఈ లిస్టు ఇస్తాయి. ఇప్పుడు మాయిశ్చురైజర్ వున్న లిప్ స్టిక్ నే ఎంచుకోవాలి. సాధారణంగా లిప్ స్టిక్స్  తో, గ్లిజరిన్ తో పాటు యాంటీ సెప్టిక్ ప్రాపర్టీస్  కుడా ఉంటాయి. కనుక ఒక సారి లిస్టు చదివించుకుని హాని కొంచెం తక్కువగా ఉన్న వస్తువును ఎంచుకోవడం బెస్ట్.

Leave a comment