ఒకే పని సాయంత్రం వరకు చేసేసి పూర్తి చేయాలనుకోవటం చాలా పొరపాటు .పనుల నడుమ బ్రేక్ రావాలి అప్పుడే హుషార్ వస్తుంది. పని మీద శ్రద్ధ కూడా వస్తుంది అంటున్నారు. డెస్క్ ముందు అయినా ఇంట్లో ఏ పనులైనా సరే పని మధ్యలో స్ట్రెచింగ్ ఎక్స్ ర్ సైజ్ చేయాలి. చేతులు కాళ్ళు స్ట్రెచ్ చేయాలి నుదురు ,మెదడు పైన మెల్లగా ,తేలిగ్గా మాసాజ్ చేసుకోవాలి. అలాగే మధ్యలో ఏదైనా సంగీతం ,ఫాస్ట్ బీట్ లేదా నెమ్మదిగా అనిపించే పాట , ఏదైనా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఆస్వాధించాలి. డెస్క్ క్లీన్ చేసుకోవచ్చు. ఐదు నిమిషాలు ధ్యానం చేయవచ్చు ఇలాంటి బ్రేక్స్ తీసుకొంటు ఉంటే పని ఒత్తిడి మనసు మీద పని చేయదు. మంచి ఫలితాలు ఉంటాయి.

Leave a comment