సినిమాల్లో ప్రతి పెళ్లి సందర్భాల్లో కూడా బాలీవుడ్ వధువుల నుదిటిపై పస్సా ఆభరణం ధరిస్తూ ఉంటారు. ఈ పస్సా ఆభరణం బాలీవుడ్ నుంచి ట్రెండీగా ఫ్యాషన్ పోకడలు లోకి వచ్చి చేరాయి.ఈ ఆభరణం సాంప్రదాయ బద్ధంగా భారీగా ఘనంగా కనిపిస్తుంది మెహందీ, సంగీత్ వంటి సందర్భాలలో పస్సా స్టయిల్స్ అసాధారణంగా కనిపిస్తాయి.పువ్వుల డిజైన్ లు చాలా బావుంటాయి కూడా. బాజీరావు మస్తానీ లో దీపికా పడుకొనే కళంకి లో మాధురి దీక్షిత్ రాజా లో ఆలియాభట్ లు  ధరించిన ఆభరణాలు గులాబీ ఆకుపచ్చ రాళ్ళ మేళవింపుతో కళ్లకు విందు చేశాయి. ఎన్నో పబ్లిక్ కార్యక్రమాల్లో కూడా వీటిని ధరించి తారలు తమ రాచరిక రూపాన్ని ప్రదర్శించారు ఒకప్పుడు సెలబ్రెటీలు ధరించిన ఈ ఆభరణం ఇప్పుడు నవతరం వధువుల ఫేవరెట్ గా నిలబడింది.

Leave a comment