గుజరాత్, రాజస్థాన్ రాష్టాల్లో మహిళలు కాళ్ళకు చేతులకు వెండి కడియాలు బరువైన లోలాకులు కంటె గొలుసులు ధరిస్తారు .పూర్వకాలం నుంచి వస్తూన్న అలవాటు వారిది . వెండికి యాంటీ బాక్టీరియల్ గుణం ఉంటుంది .డిజైన్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెండి బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారు .ఫిలిగ్రా వర్క్ తో వచ్చే వెండి నగలు నిజానికి చాల అందంగా ఉంటాయి .వెండి నగల్లో కెంపులు , పచ్చలు ముత్యాలు, నీలాలు, పగడాలు, అన్ కట్ డైమండ్స్ కలసి టెంపుల్ కుందన్, నక్షి , పాల్క్ మీనాకారి వంటి సంప్రదాయ డిజైన్ లను అనుసరిస్తూ అమెరికన్ డైమండ్లు జర్మన్ వంటి రాళ్ళను పొదిగిన వెండి నగలు ఎంతో అందంగా స్టైలిష్  గా ఉన్నాయి .

Leave a comment