ఎముకలు బెణకకుండా కండరాలు పట్టేయకుండా వ్యాయామం చేసే ముందర వార్మప్ ఎక్సర్ సైజ్ తప్పని సరిగా చేయాలి. నిలబడ్డ చోటునే మార్టింగ్ చేయాలి లేదా కాస్త దూరం నడవాలి. ఈ నడక కూడా బ్రిస్క్ వాకింగ్ అయితే శారీరక ఫిట్ నెస్ బావుంటుంది. సాధారణంగా ఫిజికల్ గా ఫిట్ నెస్ తో ఉండటం అంటే మూడు నాలుగు కిలోమీటర్లు నడిచిన శరీరం సులువుగా అలసట లేకుండా ఉండటం .కాస్త మెట్లెక్కినా ఊపిరి అందటం లేదంటే ఫిజికల్ ఫిట్ నెస్ సరిగ్గా లేదని అర్థం. ఇక వ్యాయామం తప్పనిసరి. నడిచేప్పుడు పరుగెత్తేప్పుడు నేల ఎగుడు దిగుడు గా ఉండకుండా ఉండాలి. మోకాళ్ళు,కలకలు బలహీనంగా ఉంటే సపోర్టు కోసం తగిన బ్రెసెస్ ,సాక్స్ క్యాప్స్ వాడుకోవాలి.నొప్పులు అనిపిస్తే నడక వేగం తగ్గించాలి లేదా మానేయాలి.

Leave a comment