ఒక్కో సారి చిన్న వయస్సు లోనే తెల్ల జుట్టు వచ్చేస్తూ వుంటుంది. వెంటనే డై జోలోకి పోకుండా ఫ్యాషన్ ట్రెండ్ తో జుట్టుకు సహజమైన రంగులద్ది తెల్ల జుట్టు మాయం చేయచ్చు. హెన్నాను ఇతర పదార్ధాలతో కలిపిటే జుట్టుకు తేలిక పాటి ఎరుపు త్యాన్ కలర్ వస్తుంది. బ్రౌన్ కలర్ కావాలనుకుంటే పావు కప్పు నేట్టేల్ ఆకులూ, పావు కప్పు రోజ్ మేరీ , పావు కప్పు సేజీ ఆకులు రెండున్నర కప్పులు నీరు తో కలిపి నీరు దాదాపు ఆవిరయ్యే దాకా మరిగించి  ఆ మిశ్రమం వడకట్టి వచ్చిన  కొద్ది పాటి నీళ్ళలో గోరింట పొడి కలిపి తలకు అప్లయ్ చేసి ఓ అరగంటాగీ స్నానం చేసేయాలి. దీన్ని నాలుగైదు సార్లు రిపీట్ చేస్తే కోరుకున్న రంగు వస్తుంది. ఈ హెర్బ్ మిశ్రమం వల్ల చుండ్రు తగ్గుతుంది. బాగా నిండు రంగు రావాలంటే వారానికి రెండు సార్లు ఈ హెన్నా పెడుతూనే వుండాలి. ఈ ఆకులన్నీ కాస్మెటిక్స్ దుకాణాల్లో దోరుకుతాయి.

Leave a comment