కొన్ని పదార్ధాలను పేర్లను బట్టి నమ్ముతారా ? దానిలోని కంటెంట్ ను బట్టి వాడతారా అర్ధం కాదు. ఈ మధ్య కాలంలో పెద్ద హోటల్స్ లో బ్రౌన్ షుగర్ తో చేసిన పదార్ధాల లిస్ట్ కనిపిస్తోంది అలాగే కేకులు పేస్ట్రీ లు డిజర్ట్ లు కాఫీ లు కూడా బ్రౌన్ షుగర్ వాడటం ఎక్కువై ఫ్యాషనై పోతుంది. ఇలా వాడేవారికి అసలు వైట్ షుగర్ కు బ్రౌన్ షుగర్ కు మధ్య తేడా ఏవిటో కనీసం ఏ గుగూల్ సెర్చో చేసి తెలుసుకుంటునారా ? తెల్లని పంచదార మొలాసిస్ ను తొలగించి తయారుచేస్తారు . మళ్ళీ చక్కెర మొలాసిస్ ను కలిపేసి బ్రౌన్ షుగర్ చేస్తారు. ఒక టీ స్పూన్ తెల్లని పంచదార లో 16 క్యాలరీలు ఉంటే అదే స్పూన్ బ్రౌన్ షుగర్ లో 17 క్యాలరీలున్నాయి. ఇక పోషక పరంగా చుస్తే రెండూ ఒకటే. ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవు. బ్రౌన్ రైస్ మంచిదన్నారు కనుక బ్రౌన్ షుగర్ కూడా మంచిదనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారో ఏమో.. నిజానికి అసలు ఏ పంచదార వద్దనీ పంచదార లీని జీవితాన్ని జీవించమనీ అధ్యయనాలు చెపుతున్నాయి.
Categories
Wahrevaa

బ్రౌన్ షుగర్ ఎందుకు మంచిదంటారు ?

Leave a comment