మధుర అనే గృహిణికి గుండె మార్పిడి సర్జరీ జరుగుతుంది.ఆమె క్షణం తీరిక లేని ఇల్లాలు భర్త ఇద్దరు పిల్లలు అత్త మామ గారు భర్త నాయనమ్మ తో కలిసి ఉంటూ ఇంట్లో అందరినీ ఎప్పుడూ ఆనందంగా ఉంచుతుంది.ఆపరేషన్ అయ్యాక తనకు 20 ఏళ్ల సాయి అనే అమ్మాయి గుండె అమర్చారని  తెలుసుకుంటుంది.  ఆ ఇరవై ఏళ్ల అమ్మాయి కుటుంబాన్ని వెతుకుతూ వెళుతోంది మధుర. సాయి తన ఇరవై వ సంవత్సరం నిండే లోగా కొన్ని పనులు పూర్తి చేయాలని ఓ లిస్ట్ రాసి పెట్టుకుంటుంది.అవి తీరకుండానే ఆమె ప్రమాదంలో మరణించింది.ఆ బకెట్ లిస్ట్ తను పూర్తి చేయాలనుకుంటుంది మధుర.ఇరవై ఏళ్ల అమ్మాయి హృదయంతో ఆమె ఆ లిస్ట్ ని పూర్తి చేయటం సినిమా ఒక స్ఫూర్తి కోసం,సినిమా చూడవచ్చు అలాగే మాధురి దీక్షిత్ కోసం కూడా !ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది.

Leave a comment