హిమాలయాల్లోని బౌద్ధులు నేర్చినా చిత్రకళను తాంగ్ కా అంటారు బుద్ధుని జీవితానికి సంబంధించిన అనేక సంఘటనలను చిత్రించే ఈ పెయింటింగ్స్ చాలా బావుంటాయి. చక్కని రంగులు, బంగారు పొడి ఉపయోగించి చిత్రించే తాంగ్ కా చిత్రాలు టిబెట్ లోని ప్రతి ఇంట్లోనూ ఉంటాయి ఈ గుడ్డ మీద గీసే పెయింటింగ్ కోసం కావలసిన కాన్వాస్ స్వయంగా తయారు చేసుకొంటారు బౌద్ధ గురువు తమ సూచనలతో వేసే ఈ చిత్రాలు ఇళ్లలో ఉంటే వారు ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటారని నమ్ముతారు. ఈ పెయింటింగ్స్ లో వాడే రంగులు ఎప్పటికీ మాసిపోవు.

Leave a comment