పొట్ట కాస్త పెరిగితే తప్పకుండా పట్టిచుకొండి,ఎలాగైనా దాన్ని కరిగించే ప్రయత్నం చేయండి. వ్యాయమామా? డైటింగా? మీ ఇష్టం, లేకపోతే బుద్ది కాస్త మందగిస్తుంది అంటున్నారు పరిశోధకులు. పొట్ట చుట్టు కొవ్వు పెరిగితే అది మెదడులో కీలకమైన గ్రే మాటర్ కుంచించుకు పోవటానికి కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. మెదడులో శరీరాన్ని నియంత్రించేందుకు పది వేలకోట్ల నాడీ కణాలు పని చేస్తుంటాయి. వీటిని గ్రే మాటర్ అంటారు. ఈ మెదడు కణాల్ని కలిపే నాడీ తంతుల్ని నైట్ మాటర్ అంటారు. ఒక అధ్యయనంలో బరువుగా ఉన్నా వాళ్ళతో గ్రే మాటర్ తక్కువ ఉన్నట్లు తేలింది. అందుకే అధ్యయన కారులు బరువు తగ్గించుకొండి అని హెచ్చరిస్తుంది.

Leave a comment