అమెరికా అద్యక్షుడు దోనల్డ్ ట్రంప్, ఇవానాల కూతురు ఇవాంకా ట్రంప్ చక్కని మోడల్ గా పేరు తెచ్చుకుని ప్రసిద్ద మాగజైన్ ‘వాగ్’ కవర్ పేజ్ మోడల్ గా సత్తా చాటుకుంటూ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చింది. న్యుయార్క్ రియల్ ఎస్టేట్ రంగంలో మగవాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా వుంటుంది. ఈ రంగంలో ఇవాంకా తన సమర్ధత నిరూపించుకొంది. 2005 లో ఆమె ట్రంప్ ఆర్గనైజేషన్ లో చేరింది. వ్యాపార వర్గాల్లో ఆమె చాలా పాప్యులర్. తిరుగులేని వ్యాపారవేత్త. టీ.వి కళాకారుడిగా ఆమె సుపరిచుతురాలు. రచనా రంగంలో ఆమె ప్రతిభ చాటుకున్నారు. ఆమె తోలి పుస్తకం ‘ ది ట్రంప్ కార్డ్, ఈ పుస్తకం హాట్ కేకుల్లా అమ్ముడు పోయింది. ఆమె రెండో పుస్తకం ఉమెన్ హు వర్క్ కుడా ప్రజాదరణ పొందింది. భర్త ముగ్గురు పిల్లలలో సంతోషకరమైన కుటుంబ జీవితం గడుపుతున్న ఇవాంకా తన రియల్ లైఫ్ మోడల్ తల్లే అని చెప్పుతుంది.

Leave a comment