కేరళ డిజిపి లోక్ నాథ్ బెహరా బుల్లెట్ స్క్వాడ్ దళాన్ని ఏర్పాటు చేశారు. త్రిచూర్ పట్నంలో 40 మంది మహిళా ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు ప్రత్యేకంగా కొత్త బుల్లెట్స్ ఎర్ర రంగు హెల్మెట్స్ ఇచ్చారు.ఒక్క బుల్లెట్ పైన ఇద్దరు చొప్పున రోడ్డు పైన ఎప్పుడూ 20 మంది రౌండ్స్ లో ఉండేలాగా డ్యూటీ వేశారు.ఈ దళం రోడ్ల పైకి వచ్చాక  త్రిచూర్ లో క్రమశిక్షణ వచ్చింది. కోవిడ్ హాస్పిటల్స్ దగ్గర,హోమ్ క్వారంటైన్ లో ఉన్న పేషెంట్ల గృహాల దగ్గర,వర్తక సముదాయాల దగ్గర ఈ పవర్ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది.బుల్లెట్ చప్పుడు వినిపిస్తే చాలు గుంపుగా ఉన్నవాళ్లు చెల్లాచెదురు అవుతున్నారు.ఈ బుల్లెట్ స్క్వాడ్ ఫలితాలు చూశాక ఇక రాష్ట్రమంతా మహిళా స్క్వాడ్ లను తీసుకు రావాలనికొంటున్నాం అన్నారు కేరళ డిజిపి .

Leave a comment