Categories
WoW

బుల్లి బొమ్మల కోసం ఫ్యాషన్ డ్రెస్సులు.

ప్రతి అకేషన్ కి పిల్లలకు దుస్తులు కొనేస్తారు. ఎప్పుడూ వేసుకోవలనిపిస్తే అప్పుడే కొత్త డ్రెస్ వేసేసుకొంటారు పిల్లలు. అక్కడితో ఆగితే ఈ కథే లేదు. పిల్లలతో పాటు వాళ్ళ బొమ్మలకు ఫ్యాషన్ డ్రెస్ లొచ్చాయి. పిల్లలు ఆడుకోవడానికి వీలుగా 18 అంగుళాల బొమ్మలు తయారు చేస్తారు. అందుకే ఆ సైజు లోనే పిల్లల డ్రెస్ లి వస్తున్నాయి. స్విమ్ సూట్లు, నైట్ డ్రెస్సులు, మాక్సీలు, స్కర్టులు, జీన్స్ ప్యాంట్లు, లెగ్గింగ్స్, టీ షర్ట్స్, ఓవర్ కోట్లు, పొట్టి ఫ్రాక్ లు, పొడవు గౌన్లు, సల్వార్ కమీజులు, చీరెలు, అనార్కలీ లు వాళ్ళకోసం దొరకని మోడల్స్ లేవు. ఆ డ్రెస్ కు మ్యాచ్ అయ్యే షూలు, టోపీలు, హ్యాండ్ బ్యాగ్ లు వంటి యాక్సెసరీస్ కు లెక్క లేదు. పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తుంటారు. అమ్మలు తమని ముస్తాబు చేసినట్లే పిల్లలూ తమ బొమ్మలను ముస్తాబు చేయడానికి ఉత్సాహ పడతారు.ఆ అవసరం గురించే వచ్చాయి బొమ్మలకు ఫ్యాషన్ దుస్తులు, ఎన్నో రకాల ఆభరణాలు. పైగా దుస్తులు లూజయినా, కాస్త పోడుగాయినా ఆల్టర్ చేసి ఇస్తారట. బావుంది కదూ చిన్నారి బొమ్మలకోసం ముచ్చటైన ఫ్యాషన్ డ్రెస్ లు.

Leave a comment