అభిజిత రాసిన ‘హ్యాపినెస్ ఆల్ అరౌండ్’ పుస్తకాన్ని గుర్ గావ్ లోని ప్రసిద్ధ పబ్లిషింగ్ సంస్థ ఇన్ విన్సిబుల్ ప్రచురించింది. ఇంతకీ అభిజిత వయసు ఏడేళ్లు ఆమె తండ్రి ఆషిష్ గుప్తా తల్లి అనుప్రియ గుప్తా. అభిజిత రాసిన పుస్తకం విపరీతమైన ఆదరణ పొంది ఆమె వరల్డ్ ఎంగెస్ట్ ఆథర్ అనే గుర్తింపు పొందింది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ వారు అభిజిత ను గ్రాండ్ మాస్టర్ ఇన్ రైటింగ్ గా గుర్తించారు. ఇన్ విజిబుల్ సంస్థ అభిజిత తో మరో మూడు పుస్తకాలకు ఒక్కోటి పదివేలు అచ్చు వేసేట్టుగా ఒప్పిదం కూర్చుకొన్నారు. అభిజిత తన కాంట్రాక్ట్ ప్రకారం ఇప్పటికే తన రెండో పుస్తకం రాసేసింది. దాని పేరు ‘వియ్ విల్ షూర్లీ సర్వైవ్’.

Leave a comment