వేసవి తాపం తగ్గించే వాటిల్లో మజ్జిగే ముందుగా ఉంటుంది. మజ్జిగ లో పొటాషియం, క్యాల్షియం విటమిన్-బి కాంప్లెక్స్ వంటి పోషకాలు ఎక్కువ రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు తీసుకుంటే కావాల్సిన శక్తి అందుతుంది. మజ్జిగ లో కేలరీలు కొవ్వు శాతం తక్కువ కాబట్టి బరువు పెరిగే అవకాశం లేదు. మజ్జిగ లో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. ఇందులోనే లాక్టోజ్ కార్బోహైడ్రేడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మజ్జిగ తాగితే పేగుల్లో ఉండే హానికర బ్యాక్టీరియా నశించి మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది జీర్ణాశయ సమస్యలు ఉండవు మజ్జిగ తాగితే డీహైడ్రేషన్ సమస్య రాదు.

Leave a comment