ఫోన్ లేకుండా నిమిషం నడవదు. దీన్ని వాడుతున్నంత సేపు తల దించు కుని వుంటాం. మెడ, బుజాలు నొప్పి పెడతాయి. ఫోన్ న్ని సమాంతరంగా ఉంచుకుని ట్రై చేస్తే ఇలాంటి నొప్పులు రాకుండా వుంటాయి. అల్లాగే కాలేజీ అమ్మాయిలు, జాబ్ కు వెళ్ళే వాళ్ళు బరువైన బ్యాగ్ని బుజానికి తగిలించూ కుంటారు. క్రమంగా బుజం, వెన్ను, మెడ నొప్పులు మొదలవ్వుతాయి. అందుకే టిఫిన్ బాక్స్, ఇతర బాక్స్ లు పెట్టుకునే బ్యాగులు రెండు బుజాలకు వేసుకోవాలి. అలాగే తలకింది దిండు మరీ పలుచగా లేదా మరీ ఎత్తుగా వేసుకుంటారు. దీని వల్ల వెన్ను ముక్కకి ఇబ్బంది. మెడ పై కూడా భారం పడుతుంది. అలాగే ఇంట్లో ఎదో ఒక బరువు ఎత్తి పైన పెడతాం, మాములుగా వంగి అమాంతం యట్టడం వల్ల నడుం పట్టేస్తుంది. మోకాళ్ళ పైన కుర్చుని నిదానంగా అరను చూసి యట్టుకోవాలి. అలాగే కంప్యూటర్ తెర ముందు కూడా మరీ వంగి, లేదా మరీ వెనక్కి జరాగిల బడి కూర్చోకూడదు తెరకు సరిగ్గా ఎదురుగా కూర్చోవాలి.

Leave a comment