పిల్లలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతుంది నుస్రత్‌ఖాన్ పహాడే. అందుకోసం ‘ కాక్టస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. ఈ ఎన్జీఓ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో లైంగిక వేధింపుల పై అవగాహనా కార్యక్రమాలు ప్రారంభించింది . పిల్లలకు వ్యక్తిగత శుభ్రతా ,గుడ్ టచ్ ,బ్యాడ్ టచ్ వంటివి తరగతుల్లో చెపుతారు .వేధింపుల బారిన పడ్డ పిల్లలకు అవసరమైన న్యాయ సహాయం ,కోలుకునేందుకు కావలసిన మానసిక ఆరోగ్య చికిత్సలు అందిస్తారు . ఈ సంస్థ షోలాపూర్ తో పాటు ముంబయ్,పూణే,ఢిల్లీ,హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని రెండు వేల పాఠశాల లతో కలసి పనిచేస్తోంది.